.

.

nani

14, జులై 2016, గురువారం

పాప్ కార్న్ చికెన్ / popcorn chicken

స్టారర్స్,స్నాక్స్ గా ఫేమస్ పాప్ కార్న్ చికెన్ చేయటం ఈజీ, చాలా రుచిగా ఉంటాయి,పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.నువ్వులు తో కలిపి చేయటం వలన క్రిస్పీగా వెరైటీ టేస్ట్ తో చాలా బాగుంది.  


కావలసినవి

బోన్ లెస్ చికెన్ - 1/2 k.g
శనగపిండి - 1 tbsp
మైదా - 1 tbsp
బియ్యప్పిండి - 1 tbsp 
నువ్వులు - 2 tbsp 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp 
కారం - 1 tbsp
గరం మసాలా - 1 tsp
ధనియాల  పొడి  - 1 tsp
జీలకర్ర   - 1/2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - 1/4 tsp 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా


తయారుచేసే విధానం 

బోన్ లెస్ చికెన్ శుభ్రంగా కడిగి 
చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి.



చికెన్ లో ఉప్పు,పసుపు,కారం,
 ధనియాలపొడి,గరం మసాలా పొడి,
వేసి బాగా కలపాలి.


ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి 
1 గంట మారినేట్ చేయాలి.


1 గంట మారినేట్ చేసిన చికెన్ లో శనగపిండి,
మైదా,బియ్యప్పిండి, నువ్వులు,జీలకర్ర వేయాలి.


మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి.


బాండీలో నూనె పోసి బాగా కాగాక 
కొంచెం కొంచెం చికెన్ వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. 


 ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించి తీసేయాలి. 


చివరిగా ధనియాలపొడి,చాట్ మసాలా పౌడర్ 
వేసి బాగా కలపాలి.


 క్రిస్పీ, టేస్టీ పాప్ కార్న్ చికెన్ / popcorn  chicken రెడీ 
 ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా బాగుంటాయి. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు