.

.

nani

15, జులై 2016, శుక్రవారం

పెసర మొలకల కిచిడి / Sprouted Green Moong dal Khichdi


పచ్చపెసలు అన్నిటికంటే సులభంగా మొలకలు వస్తాయి.పోషకాహార విలువలు (nutritional benefits)కూడా ఎక్కువే.గుండె ఆరోగ్యానికి, కంటి చూపుకి మంచిది.చెడు  కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.తక్కువ కేలరీలు కలిగి, విటమిన్ C ఎక్కువగా ఉండే పెసర మొలకలు  పచ్చిగా తినటానికి కూడా రుచిగా ఉంటాయి. ఈ పెసర మొలకల కిచిడి పిల్లలకి కూడా రోజూ పెట్టొచ్చు..


పెసర మొలకల కిచిడి


కావలసినవి 

బియ్యం - 2 కప్పులు
నీళ్లు - 4 కప్పులు
పెసరమొలకలు - 1  కప్పు
పచ్చి బఠానీలు  - 1/2 కప్పు
కారట్ - 2
బంగాళాదుంప - 1
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1 
టమాటా - 1
అల్లం - చిన్న ముక్క 
 వెల్లుల్లి - 2 రెబ్బలు
కాప్సికం - 1/2
కరివేకాకు - 2 రెమ్మలు 
పసుపు - కొద్దిగా 
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - 1 tsp 
గరం మసాలా పొడి - 1 tsp 
దాల్చిన చెక్క - కొద్దిగా 
లవంగాలు -2 
యాలకులు - 2 
జీలకర్ర - కొద్దిగా (తాలింపుకి )
బిర్యానీ ఆకు - కొంచెం
వెన్న - 1 tbsp


 తయారుచేసే విధానం 

 పెసలు ముందురోజే నానబెట్టి 
మొలకలు తయారు చేసి పెట్టాలి. 


కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి.


కుక్కర్ లో వెన్న వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు,
దాల్చినచెక్క,లవంగాలు,యాలకు వేసి వేయించాలి.


సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి , పచ్చిమిర్చి,
ఉల్లిపాయలు,కరివేపాకు వేసి వేయించాలి.


 కారట్, బంగాళాదుంప,కాప్సికమ్, పచ్చి బఠాణీలు 
కూడా వేసి వేయించాలి.


పసుపు,ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.


 కూరగాయ ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత 
పెసర మొలకలు వేసి కలపాలి.


 ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా, గరంమసాలాపొడి,
ధనియాల పొడి వేసి బాగా కలపాలి. 


 నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపాలి. 


 ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు చొప్పున పోసి,
1/2 చెక్క నిమ్మరసం పిండి నీళ్లు,బియ్యం 
అంతా బాగా కలిసేలా కలపాలి.


 కుక్కర్ మూత పెట్టి, 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తే
కిచిడీ రెడీ అయినట్లే 


ఈ  పెసర మొలకల కిచిడి పెరుగు రైతాతో 
తింటే చాలా బాగుంటుంది.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు