.

.

nani

18, జనవరి 2017, బుధవారం

కాకరకాయ కారప్పొడి / Bitter Gourd Chilli Powder


కాకరకాయ చక్రాల్లా తరిగి కారం చేస్తుంటాము. కానీ కాకరకాయ కారప్పొడి మాత్రం కాకరకాయల్ని కూడా పొడి చేస్తాము.ఆరోగ్యానికి చాలా మంచిది  కాబట్టి ముక్కలు తినలేని వాళ్లకి ఇలా కారప్పొడి చేసి పెట్టొచ్చు. 

కాకరకాయ కారప్పొడి / Bitter Gourd Chilli  Powder 


కావలసినవి 
కాకరకాయలు - 1/4 k.g 
ఎండుమిర్చి - 10
మినప్పప్పు - 1 Tbsp 
పచ్చి శనగపప్పు - 1 Tbsp 
ధనియాలు - 2 Tbsp 
జీలకర్ర -  1/2 Tbsp 
వెల్లుల్లి రెబ్బలు - 10
కరివేపాకు -  5 రెమ్మలు 
నూనె - 1 Tbsp  
ఉప్పు - రుచికి సరిపడా 



తయారుచేసే విధానం 

కాకరకాయల్ని సన్న ముక్కలుగా తరిగి 
బాండీలో కొంచెం ఎక్కువ నూనె పోసి కాగాక 
కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై/రోస్ట్ చేయాలి 


బాండీలో నూనె లేకుండా ఎండుమిర్చి,ధనియాలు,పచ్చిపప్పు,
మినప్పప్పు,జీలకర్ర,కరివేపాకు,
వెల్లుల్లి అన్నిటినీ విడివిడిగా డ్రై రోస్ట్ చేయాలి. 


వేయించిన కాకరకాయ ముక్కలు,
మసాలా దినుసులు అన్నిటినీ 
మిక్సీ లో వేసి తగినంత ఉప్పు కూడా వేయాలి. 


ఇలా మెత్తగా పౌడర్ చేయాలి. 
అన్నిటినీ రోస్ట్ చేసాము కాబట్టి పొడి ఈజీగానే అవుతుంది. 


కాకరకాయ కారప్పొడి  టిఫిన్స్ లో అన్నంలో 
దేనిలో తిన్నా చాలా బాగుంటుంది. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు