.

.

nani

12, జనవరి 2017, గురువారం

గ్రీన్ మసాలా చికెన్ టిక్కా / Green Masala Chicken Tikka



చికెన్ టిక్కా పంజాబీ వంట.ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్,పాకిస్తాన్ లో కూడా పాపులర్ డిష్ అని చెప్తారు. టిక్కా అంటే "bits" or "pieces". చికెన్ ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి  skewers కి గుచ్చి,తండూరీ పొయ్యిలో కాల్చి  చేసే ఈ చికెన్ టిక్కా Punjabi cuisine ప్రత్యేక వంటకం.  దీన్ని మేము గ్రీన్ మసాలా పేస్ట్ కలిపి చేశాము.

గ్రీన్ మసాలా  చికెన్ టిక్కా / Green Masala Chicken Tikka


 కావలసినవి 

బోన్ లెస్ చికెన్ - 1/2 k.g
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 Tbsp
మిరియాలపొడి - 1  Tbsp
గరం మసాలా - 1  Tbsp
నిమ్మకాయ - 1/2 చెక్క
ఓరెగానో /Oregano - 1  Tbsp
చిల్లి ఫ్లేక్స్ - 1 Tsp
పెరుగు  - 2 Tbsp
ఉప్పు - రుచికి సరిపడా 
బటర్ - 2 Tbsp

గ్రీన్ మసాలా పేస్ట్ కోసం కావలసినవి 

పచ్చిమిర్చి - 6
కరివేపాకు - 3 రెమ్మలు 
పుదీనా - 1/2 కట్ట 
కొత్తిమీర - 1/2 కట్ట

తయారుచేసే విధానం 

గ్రీన్ మసాలా పేస్ట్ కోసం తీసుకున్న పచ్చిమిర్చి,కరివేపాకు,
పుదీనా,కొత్తిమీరలను శుభ్రంగా కడిగి మిక్సీజార్ లో వేసి 
మెత్తగా పేస్ట్ తయారుచేసి పెట్టాలి.


చికెన్ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి,
తగినంత ఉప్పు,పసుపు పట్టించాలి 


 తయారుచేసి పెట్టిన గ్రీన్ మసాలా పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.


పెరుగు వేసి బాగా కలిపి , మిరియాల పొడి కూడా వేయాలి


మిరియాల పొడి,చిల్లీ ఫ్లేక్స్ తో పాటు 
ఓరెగానో వేయాలి. దీనివలన చికెన్ కి మంచి ఫ్లేవర్ ,రుచి వస్తుంది


1 Tbsp ఓరెగానో  వేయాలి


1 Tbsp గరం మసాలా , 1/2 చెక్క నిమ్మరసం పిండాలి


ఉప్పు,పసుపు,గ్రీన్ మసాలా పేస్ట్,అల్లం వెల్లుల్లి పేస్ట్,పెరుగు 
వేసి కలిపిన చికెన్ లో మిరియాల పొడి,చిల్లీ ఫ్లెక్స్,ఓరెగానో,
గరం మసాలా, అరచెక్క నిమ్మరసం అన్నీ వరసగా వేస్తూ 
అంతా  బాగా కలిసేలా కలిపి 1/2 గంట మారినేట్ చేయాలి. 


ఒక వెడల్పు బాండీలో వెన్న/Butter  వేసి కరిగాక,
మారినేట్ చేసి పెట్టిన చికెన్ ముక్కలు వేసి 15 నిమిషాలు 
మీడియం ఫ్లేమ్ తో ఉడికించాలి.


చికెన్ లో నీరు ఇగిరిపోయి,బాగా వేగి, వెన్న పైకి తేలేంత వరకు 
వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.


చికెన్ టిక్కా చేయటానికి ఈ skewers  
 బాగా ఉపయోగపడతాయి.వీటితో ఈజీగా చేసుకోవచ్చు.



వేయించి పెట్టిన చికెన్ ముక్కల్ని Skewers కి గుచ్చాలి.
 చికెన్ అంతా ఇలా చేసి పెట్టాలి.


స్టవ్ మీద జాగ్రత్తగా తిప్పుతూ  కాల్చాలి


టేస్టీ/ స్పైసీ 
 గ్రీన్ మసాలా  చికెన్ టిక్కా / Green Masala Chicken Tikka రెడీ..  
వీటిని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు