.

.

nani

16, జనవరి 2017, సోమవారం

మసాలా పప్పుచెక్కలు / Masala Pappuchekkalu


పప్పుచెక్కలు పండగల సందర్భంగా చేసే పిండివంట.పచ్చిమిర్చికారంతో, జీలకర్రతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. పల్లీలు, సగ్గుబియ్యం,పచ్చి పప్పు,ఛాయ పెసరప్పు, కారం వేసి చేసుకునే ఈ మసాలా పప్పుచెక్కలు చాలా రుచిగా బాగుంటాయి. 

మసాలా పప్పుచెక్కలు / Masala Pappuchekkalu


కావలసినవి 
బియ్యప్పిండి - 3 కప్పులు
పల్లీలు - 1/4 కప్పు
నానబెట్టిన పచ్చి శనగపప్పు - 1/4 కప్పు
నానబెట్టిన చాయపెసర పప్పు - 1/4 కప్పు 
నానబెట్టిన సగ్గుబియ్యం - 1/4 కప్పు 
పచ్చిమిర్చి,వెల్లుల్లి ముద్ద /కారం - రుచికి తగినట్లు 
జిలకర - 2 టీ స్పూన్స్
వెన్న - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి సరిపడా 
నీళ్ళు - పిండి కలపటానికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై కి  సరిపడా

తయారుచేసే విధానం 

ఒక వెడల్పు గిన్నెలో బియ్యప్పిండి,2-3 గంటల పాటు  నానబెట్టిన 
పచ్చిపప్పు,ఛాయపెసరపప్పు,సగ్గుబియ్యం,పల్లీలు 
ఉప్పు,కారం.జీలకర్ర,వెన్న   వేయాలి. 


అన్నిటినీ బాగా కలిసేలా పొడిగానే కలపాలి. 


తగినన్ని నీళ్లను మరిగించి వేడి నీళ్లతో పిండి కలపాలి. 
*పిండిని వేడి నీళ్లతో కలపటం వలన చెక్కలు క్రిస్పీగా వస్తాయి*  


తగినన్ని నీళ్ళు పోస్తూ ఇలా గట్టిగా పిండిముద్ద కలపాలి 


కలిపిన పిండిముద్దని చిన్న చిన్న ఉండలు చేయాలి. 


ప్లాస్టిక్ కవర్ మీద  కొద్దిగా నూనె రాస్తూ, పల్చగా వత్తాలి .  


బాండీలోనూనె పోసి కాగాక తయారుచేసి పెట్టిన 
చెక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించాలి


గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించి తీసేయాలి. 
క్రిస్పీ మసాలా పప్పుచెక్కలు  రెడీ 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు