.

.

nani

21, మార్చి 2017, మంగళవారం

బెండకాయ ఫ్రై / andhra style bhindi fry / okra fry recipe


బెండకాయ జిగురు వల్ల కూర చేయటం కొంచెం కష్టమే కానీ బెండకాయలు కడిగి,కట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకుంటే వండటం ఈజీ.బెండకాయ అన్ని ప్రాంతాల్లో చాలా రకాలు చేస్తారు.సింపుల్ గా ఉప్పు,కారం తక్కువ వేసి చేసే ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. 

బెండకాయ ఫ్రై / andhra style bhindi fry


కావలసినవి 

బెండకాయలు - 1/4 k.g 
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిర్చి - 2 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 1 tsp 
పసుపు - చిటికెడు 

తాలింపుకోసం 
నూనె - 2 tbsp 
ఆవాలు,జీలకర్ర - 1 tsp 
ఎండుమిర్చి - 2

తయారుచేసే విధానం 

బెండకాయలు నీళ్లలో కడిగి,పొడిగుడ్డతో తుడిచి,ఆరాక,
బెండకాయలు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. 


బాండీలో నూనె వేసి కాగాక,ఆవాలు,జీలకర్ర,
ఎండుమిర్చి వేసి వేగాక, ఉల్లిపాయలు,
పచ్చిమిర్చి,కరివేపాకు వేయించాలి. 


వేగిన ఉల్లిపాయల్లో బెండకాయ ముక్కలు వేసి 
5 నిమిషాలు కలుపుతూ వేయించాలి


పసుపు,ఉప్పు,కారం వేసి, కలిపి 
10 నిమిషాలు sim లో ఉంచి కలుపుతూ వేయించాలి. 

*కలుపుతూ వేయిస్తే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి 

బెండకాయముక్కలు బాగా వేగేదాకా ఫ్రై చేసి 
స్టవ్ ఆఫ్  చేస్తే కూర రెడీ అయినట్లే. 


బెండకాయ ఫ్రై అన్నంలో ఒట్టిదే తిన్నా,
సాంబారు రసంతో కలిపి తిన్నా చాలా బాగుంటుంది. 
మసాలాలు,కారం తక్కువేస్తాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు