.

.

nani

17, మార్చి 2017, శుక్రవారం

బెండకాయ పులుసు/ Bendakaya Pulusu


బెండకాయ పులుసు ఆంధ్రా/ South India లో ఎక్కువగా చేసుకునే కూర.  కారంగా,పుల్లగా ఉండే ఈ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకుంటారు.

బెండకాయ పులుసు/ Bendakaya Pulusu 

కావలసినవి 

బెండకాయలు - 1/4 k.g 
టమాటాలు - 3
ఉల్లిపాయ పెద్దది - 1
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు 
కొత్తిమీర - కొద్దిగా 
చింతపండు - నిమ్మకాయంత
పసుపు - చిటికెడు 
కారం - 2 tsp 
గరం మసాలా పౌడర్- 1 tsp
ఉప్పు - రుచికి సరిపడా 

 తాలింపుకోసం 
నూనె - 2 tbsp 
 జీలకర్ర,ఆవాలు,పచ్చిపప్పు -  కొద్దిగా 
ఎండుమిర్చి - 2
 
తయారుచేసే విధానం

బెండకాయలు శుభ్రంగా కడిగి,పొడిగుడ్డతో తుడిచి,
మరీ సన్నగా కాకుండా 1 inch సైజ్ లో కట్ చేయాలి. 

ఉల్లిపాయ,టమాటాలను సన్నగా తరగాలి. 
పచ్చిమిర్చి చీలికలు చేయాలి.


నానబెట్టిన చింతపండులో 2 కప్పుల నీళ్ళుపోసి 
చింతపండు పులుసు తయారుచేసి పెట్టాలి. 

బాండీలో నూనె వేసి కాగాక జీలకర్ర,ఆవాలు,
ఎండుమిర్చి పచ్చిపప్పు వేసి వేగాక,
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి


ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా 
కొంచెం మగ్గగానే పసుపు,కొంచెం ఉప్పు,
తరిగిన టమాటాలు వేసి కలపాలి. 


టమాటాలు బాగా మెత్తగా అయ్యేదాకా 
మీడియం మంటమీద  కలుపుతూ ఉడికించాలి 


టమాటాలు పూర్తిగా ఉడికాక బెండకాయ ముక్కలు,
ఉప్పు,కారం,గరం మసాలా పౌడర్ వేసి కలపాలి.


బెండకాయ ముక్కలు మగ్గేదాకా 5 నిమిషాలు ఉడికించాలి.


తయారుచేసిపెట్టిన చింతపండు పులుసు పోసి,
మూతపెట్టి  5 నిమిషాలు low flame తో ఉడికించాలి.


బెండకాయముక్కలు బాగా మెత్తగా ఉడికేదాకా 
sim లో ఉంచి ఉడికించాలి.


చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే 
బెండకాయ పులుసు తయారయినట్లే


బెండకాయ పులుసు అన్నంలో తింటే చాలా బాగుంటుంది. 
ముద్దపప్పులో కలుపుకుని కూడా తింటారు.





0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు