.

.

nani

27, మార్చి 2017, సోమవారం

స్పైసీ చికెన్ కర్రీ / Indian Village Chicken Curry



చికెన్ కూరలో ఉప్పు,కారాలు ఇప్పుడు తక్కువగా వేసుకుంటున్నాం కానీ మా చిన్నప్పుడు చికెన్ కూరంటే ఉప్పు,కారం,మసాలాలు  ఎక్కువగా వేసి చేసేవాళ్ళు.పండగలైనా,చుట్టాలొచ్చినా చికెన్ ఇలా ప్రత్యేకంగా చేసేది మా అమ్మ.నాటుకోడి కూరలో ఉప్పు,కారం ఎక్కువగా వేసి స్పైసీగా చేసే కూరని ఇప్పుడు రెస్టారెంట్స్ లో విలేజ్ చికెన్ కర్రీ అంటున్నారు.నాటుకోడి కాకపోయినా మామూలు కోడితో కూడా ఇలా చేసుకోవచ్చు.


స్పైసీ చికెన్ కర్రీ / Indian Village Chicken Curry

కావలసినవి 

చికెన్ - 1 k.g 
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 6
  కొత్తిమీర - 1/2 కట్ట 
పుదీనా - 1/2 కట్ట 
కరివేపాకు - 2 రెమ్మలు 
పనుపు - 1 tsp
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 2 tbsp 
గరం మసాలాపొడి - 1 tbsp 
నూనె - 3  tbsp 

మసాలా పేస్ట్ కోసం 

ఉల్లిపాయ - 1 పెద్దది 
అల్లంవెల్లుల్లి పేస్ట్  - 1 tbsp
ఎండుకొబ్బరి - 1 tbsp 
గసగసాలు - 1/2 tbsp 
షాజీరా - 1/2 tsp 
దాల్చినచెక్క - చిన్నముక్క
లవంగాలు - 5/6
యాలకులు - 3

తయారుచేసే విధానం 

చికెన్ శుభ్రంగా కడిగి,కొద్దిగా పసుపు,ఉప్పు పట్టించి ఉంచాలి.


కొత్తిమీర,కరివేపాకు,పుదీనాలను శుభ్రంగా కడిగి,
కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాలి. 


ఉల్లిపాయముక్కలు ,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఎండుకొబ్బరి,
గసగసాలు,షాజీరా,దాల్చినచెక్క ,
లవంగాలు,యాలకులు అన్నిటినీ మిక్సీ జార్లో పేస్ట్ చేయాలి.


ఇలా మసాలాపేస్ట్ తయారుచేసి పెట్టాలి.


బాండీలో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు,పుదీనా 
కరివేపాకు వేసి వేయించాలి.


వేగిన ఉల్లిపాయల్లో తయారుచేసి పెట్టిన మసాలా పేస్ట్, 
 తగినంత ఉప్పు వేసి, మసాలా అంతా పచ్చివాసన పోయి,
నూనె పైకి తేలేదాకా కలుపుతూ 10 నిమిషాలు వేయించాలి.

 

వేగిన మసాలా పేస్ట్ లో గరం మసాలా పొడి వేసి కలిపి,
పసుపు,ఉప్పు పట్టించి వుంచిన చికెన్ ముక్కలు,
పచ్చిమిర్చి చీలికలు వేయాలి.


చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలా కలిపి 
మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.


గ్రేవీగా ఉడికిన చికెన్ లో కారం వేసి  కలిపి,
మరో 10 నిముషాలు ఉడికించాలి.


2 కప్పుల నీళ్లు పోసి కలిపి,మూతపెట్టి 
మీడియం మంటమీద 15 నిమిషాలు ఉడికించాలి.


చికెన్ మెత్తగా అయ్యేదాకా ఉడికించి,
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వెయ్యాలి.


కూరంతా బాగా కలిపి మరో 5 నిమిషాలు 
sim లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. 


స్పైసీ గా, ఎర్రగా, రుచిగా ఉండే 
 స్పైసీ చికెన్ కర్రీ / Indian Village Chicken Curry 
వేడిగా అన్నంలో కలుపుకుని తింటే చాల బాగుంటుంది



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు