.

.

nani

11, మార్చి 2017, శనివారం

పనీర్ కాప్సికమ్ రోల్స్ / paneer capsicum rolls


చపాతీ రోల్స్ లో ఈ పనీర్ కాప్సికం రోల్స్ ఒక వెరైటీ.పనీర్ క్యూబ్స్ లా కాకుండా బుర్జీలాగా తయారుచేసి ఈరోల్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి.స్పైసీ/టేస్టీ గా ఉండే ఈ రోల్స్ nutritious,healthy కూడా.పిల్లలు,పెద్దలు అందరు ఇష్టపడతారు.లంచ్ కే కాదు ఈవినింగ్ స్నాక్స్ గా కూడా బాగుంటాయి. 

పనీర్ కాప్సికమ్ రోల్స్ /paneer capsicum rolls


 కావలసినవి

వేయించిన  చపాతీలు - అవసరమైనన్ని 
పనీర్ తురుము - 3 కప్పులు
కాప్సికమ్ - 1 పెద్దది
ఉల్లిపాయలు - 3 
కొత్తిమీర - కొద్దిగా 
పుదీనా - కొద్దిగా 
కరివేపాకు - 2 రెమ్మలు
గరం మసాలా - 1tbsp
జిలకరపొడి - 1/2 టీ  స్పూన్
ధనియాలపొడి - 1/2 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్
పసుపు - 1/2 టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీ  స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్


తయారుచేసే విధానం

పనీర్ ని బ్లెండర్ లో  పొడిగా చేసి పెట్టాలి . 

కాప్సికమ్ కొంచెం పెద్దముక్కలు కట్ చేయాలి 
ఉల్లిపాయలు సన్నగా తరగాలి. 

బాండీలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు,
కరివేపాకు,పుదీనా, పసుపు, వేసి వేగనివ్వాలి

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 
పచ్చివాసన పోయెదాకా వేయించాలి. 

ఇందులో గరం మసాలా పొడి,ధనియాలపొడి,జిలకరపొడి 
ఉప్పు,కారం  వేసి బాగా కలపాలి . 

మసాలా పొడులన్నీ కొంచెం మగ్గిన తర్వాత 
కొంచెం పెద్దముక్కలుగా కట్ చేసిన కాప్సికమ్ వేసి 
5 నిమిషాలు వేయించాలి. 


ఇందులో తురిమిన పనీర్ వేసి,కొత్తిమీర చల్లి  
బాగా కలిపి , 5 నిమిషాలు మగ్గనివ్వాలి .
పనీర్ కాప్సికమ్ స్టఫింగ్ రెడీ అయినట్లే. 
  


ఇప్పుడు రోల్స్ తయారుచేసే విధానం 

చపాతీలు పలుచగా కావలసినన్ని తయారుచేసి పెట్టుకోవాలి 
ఒక్కో చపాతీపై ముందుగా మయనీజ్ రాయాలి


తయారుచేసి పెట్టిన పనీర్ కాప్సికమ్ స్టఫింగ్,
కావాలనుకుంటే కొంచెం సన్నగా తరిగిన 
ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర వేసి రోల్స్ చుట్టాలి. 


స్పైసీ పనీర్ కాప్సికమ్ రోల్స్ / paneer capsicum rolls రెడీ 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు