.

.

nani

31, మార్చి 2017, శుక్రవారం

వాము పూరీ / Vamu Poori /Ajwain Poori


పూరీ చాలామందికి ఇష్టమైన,ఫేమస్ breakfast.ఆలూ కర్రీతో తింటే చాలా బాగుంటుంది.ఉదయం,సాయంత్రం ఎప్పుడైనా టిఫిన్ కోసం చేసుకోవచ్చు.

వాము పూరీ / Vamu Poori /Ajwain Poori

కావలసినవి

గోధుమపిండి - 2 కప్పులు 
నూనె - 1/2 టేబుల్  స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా 
వాము - కొద్దిగా
నీళ్ళు - పిండి ముద్ద చేయటానికి తగినన్ని 
నూనె డీప్ ఫ్రై కి సరిపడా

తయారుచేసే విధానం

* మిక్సింగ్ బౌల్ లో గోధుమపిండి,నూనె,
ఉప్పు,వాము  వేసి తగినన్ని నీళ్ళు పోస్తూ
చపాతీ పిండి ముద్ద గట్టిగా కలపాలి. 

* ఈ పిండిముద్దని 10-15 నిమిషాలు మూతపెట్టి 
పక్కన ఉంచాలి .
 

చపాతీపిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ చేయాలి. 


చపాతీకర్రతో మరీ పల్చగా కాకుండా పూరీలు వత్తాలి.


ఇలా అన్ని పూరీలు చేసి పెట్టాలి.


బాండీలో నూనె పోసి బాగా కాగాక 
పూరీలు వేసి మీడియం మంటమీద వేయించాలి.


రెండువైపులా తిప్పి,గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తే
వాము పూరీ / Vamu Poori /Ajwain Poori
రెడీ.. పూరీ కూరలోనే కాకుండా నాన్ వెజ్,వెజ్ కూరల్లో
కూడా చాలా బాగుంటుంది.


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు