.

.

nani

12, ఏప్రిల్ 2017, బుధవారం

బ్రెడ్ పిజ్జా / Bread Pizza



పిజ్జా కి ఉపయోగించే టాపింగ్స్ తోనే  చేసుకునే ఈ బ్రెడ్ పిజ్జా 
చాలా బాగుంటుంది.చేయటం కూడా ఈజీ.ఓవెన్ లో స్టవ్ మీద రెండు విధాలుగా చేసుకోవచ్చు.

బ్రెడ్ పిజ్జా / Bread Pizza

కావలసినవి 

White Bread/Brown Bread - 8
ఉల్లిపాయ - 1
కాప్సికమ్  - 1
కారట్ - 1
టమాటా - 1
టమాటా కెచప్ - తగినంత 
ఓరెగానో /Oregano - కొద్దిగా 
పెప్పర్ పౌడర్ - కొద్దిగా 
ఉప్పు - చిటికెడు 
బటర్ - తగినంత 





తయారుచేసే విధానం 

ఉల్లిపాయ,టమాటా,కాప్సికమ్ ను సన్నగా తరగాలి. 
కారట్ సన్నగా తురమాలి. 
చీజ్ సన్నగా తురమాలి. 


ఒక మిక్సింగ్ బౌల్ లో సన్నగా తరిగిన కూరగాయముక్కలు,
ఓరెగానో,పెప్పర్ పౌడర్,ఉప్పు వేసి కలపాలి. 
టాపింగ్  రెడీ 

స్టవ్  మీద పెనం వేడి చేసి, వెన్న వేసి కరిగాక 
పెనం అంతా బటర్ స్ప్రెడ్ చేయాలి. 


బ్రెడ్ రెండువైపులా మరీ ఎక్కువగా కాకుండా 
కొంచెం వేడయ్యేలా బ్రేడ్ వేయించి,తీసేయాలి. 


వేడి చేసిన బ్రెడ్ మీద టమాటా కెచప్ రాసి,
తయారుచేసి పెట్టిన టాపింగ్  పెట్టాలి. 


టాపింగ్ మీద చీజ్ తురుము ఇలా స్ప్రెడ్  చేయాలి 


మళ్ళీ పెనం మీద బటర్ స్ప్రెడ్ చేసి,
తయారుచేసి పెట్టిన పిజ్జాలను పెట్టి, 
వేడికి చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఉంచి తీసేయాలి. 


టేస్టీ  బ్రెడ్ పిజ్జా / Bread Pizza రెడీ .. 
చాలా ఈజీగా సాయంత్రం స్నాక్స్  కోసం  చేసుకోవచ్చు. 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు