.

.

nani

24, ఏప్రిల్ 2017, సోమవారం

ఎగ్ లెస్ టూటీ ఫ్రూటీ కుకీస్ / Eggless tutti frutti cookies



Famous కరాచీ ఫ్రూట్ బిస్కట్స్ టేస్ట్ తో చూడటానికి కూడా అలాగే కనిపించే ఎగ్ లెస్ టూటీ ఫ్రూటీ కుకీస్ ఇష్టమైన ఫ్లేవర్స్ కోసం కావాల్సిన ఎసెన్స్ వేసుకుని,ఇంట్లోనే చేసుకోవచ్చు.  


ఎగ్ లెస్ టూటీ ఫ్రూటీ కుకీస్ / Eggless tutti frutti cookies

కావలసినవి 
మైదా - 1 కప్పు 
పంచదారపొడి /Sugar Powder - 3/4 కప్పు 
పాలు - 1/4 కప్పు 
వెన్న/Butter - 1/2 కప్పు 
టూటీ ఫ్రూటీ /tutti frutti - 1/2 కప్పు 
బేకింగ్ పౌడర్ / Baking powder - 1 tsp 
వెనిల్లా ఎసెన్స్ - 1/2 tsp 

తయారుచేసే విధానం

మిక్సింగ్ బౌల్ లో మైదా,పంచదార పొడి,వెన్న,పాలు,
బేకింగ్ పౌడర్,వెనిల్లా ఎసెన్స్,టూటీఫ్రూటీ
అన్నీ వేసి బాగా కలపి,పిండి ముద్ద చేయాలి.


 తయారుచేసిన పిండిముద్దని  (dough)
రౌండ్ షేప్ లో చేసి,కవర్లో చుట్టి 1 గంట ఫ్రిజ్ లో ఉంచాలి. 

ఫ్రిజ్ లో పెట్టటం వలన పిండి గట్టిపడి 
కుకీ షేప్ సరిగ్గా వస్తుంది. 


గంట తర్వాత పిండిముద్దని ఇలా రౌండ్ 
( 1/2 inch thick roundels)కుకీ షేప్ కట్ చేయాలి. 


బేకింగ్ ట్రే మీద వెన్న రాసి, స్ప్రెడ్ చేయాలి. 


వెన్నరాసిన ట్రే మీద 
కట్ చేసిన కుకీస్ ఇలా సెట్ చేయాలి. 


Preheat the oven at 180c for 10 minutes. 

ప్రీహీట్ చేసిన ఓవెన్ లో ట్రే పెట్టి 170c లో 
8-12 నిమిషాలు బేక్ చేయాలి.


ఎగ్ లెస్ టూటీ ఫ్రూటీ కుకీస్ / Eggless tutti frutti cookies   
మంచిరుచితో చాలా బాగుంటాయి. 
నిల్వ చేయాలంటే కుకీస్ పూర్తిగా చల్లారాక airtight డబ్బాలో పెట్టాలి. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు