.

.

nani

2, ఏప్రిల్ 2017, ఆదివారం

KFC ఫ్రైడ్ చికెన్ / KFC style fried chicken


KFC చికెన్ చాలామంది ఇష్టపడతారు.kfc wednesday offers లో రకరకాల ఆఫర్స్ ఇస్తుంటారు.మా ఇంట్లో కూడా అందరికీ KFC చికెన్ ఇష్టం.ఈమధ్య KFC  style చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారని ట్రై చేశాను.నేను చేసింది కూడా టేస్ట్ బాగానే ఉంది.

   KFC ఫ్రైడ్ చికెన్ / KFC style fried chicken

కావలసినవి

చికెన్ లెగ్స్ - 7
కోడిగుడ్లు - 3
పాలు - 1 tbsp
ఓట్స్ - 1 కప్పు 
కార్న్ ఫ్లోర్ - 1/2 కప్పు 
బ్రెడ్ పొడి/bread crumbs - 1/2 కప్పు 
అల్లం వెల్లుల్లి,ఉల్లిపాయ  పేస్ట్ - 1 tbsp 
మిరియాలపొడి - 1 tsp
కారం - 1 tsp

నూనె డీప్ ఫ్రై కి సరిపడా  
ఉప్పు - రుచికి సరిపడా


చికెన్  మారినేట్ (marinate)చేయటం కోసం

పసుపు - 1 tsp 
కారం - 1 tsp 
మిరియాలపొడి - 1 tsp 
ఉప్పు - 1 tsp 
నిమ్మరసం - 1 tbsp

 

తయారుచేసే విధానం 

చికెన్ లెగ్స్ శుభ్రంగా కడిగి చాకుతో గాట్లు పెట్టాలి.


పసుపు,కారం,మిరియాలపొడి, ఉప్పు
నిమ్మరసం అన్నీ వేసి, 
చికెన్ 1-2 గంటలు మారినేట్ (marinate) చేయాలి 


ఒక బౌల్ లో కోడిగుడ్లు,పాలు వేసి 
స్మూత్ గా అయ్యేదాకా బీట్ చేయాలి.


ఒక వెడల్పు బౌల్/  ప్లేట్ లో ఓట్స్,కార్న్ ఫ్లోర్,
బ్రెడ్ పొడి/bread crumbs,అల్లంవెల్లుల్లి పేస్ట్,
ఉప్పు,కారం,మిరియాలపొడి వేసి బాగా కలపాలి. 

 flour mixture

మారినేట్ (marinate) చేసి పెట్టిన చికెన్ లెగ్స్ ని 
ఓట్స్ మిశ్రమం (flour mixture) లో 
చికెన్ అంతా కవర్ అయ్యేలా ముంచాలి.  


ఓట్స్ మిశ్రమం (flour mixture) తో 
కవర్ చేసిన చికెన్ ని ఎగ్ సొనలో ముంచాలి .


ఎగ్ సొనలో ముంచిన  చికెన్ ని మళ్ళీ
ఓట్స్ మిశ్రమం (flour mixture) తో కవర్ చేయాలి. 


బాగా కాగిన నూనెలో మీడియం మంటమీద డీప్ ఫ్రై చేయాలి.


క్రిస్పీ గా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. 


 KFC ఫ్రైడ్ చికెన్ / KFC style fried chicken రెడీ 
దాదాపు KFC రుచితో చాలా బాగుంది. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు