.

.

nani

6, ఏప్రిల్ 2017, గురువారం

సామల పులిహోర / Little Millet pulihora



సజ్జలు,రాగులు, కొర్రలు,సామలు,వరిగలు, అరికెలు ఇవన్నీ చిరు /తృణధాన్యాలు. వీటన్నింటినీ ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అంటారు.వీటిని వెనకటిరోజుల్లో ఎక్కువగా తినేవాళ్లు,కాలక్రమేణా అవి తినటం తక్కువగా భావించి బియ్యం తినటం ఎక్కువయ్యింది.ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం తినటం వలన రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించి మిల్లెట్స్ రోజువారీ ఆహారంలో ఉపయోగించటం మంచిదని వైద్యులు కూడా చెప్తున్నారు. 

మిల్లెట్స్ ఉపయోగాలు --

బియ్యం, జొన్నల్లో లాగా పిండి పదార్ధాలూ గోధుమల్లోని ప్రొటీన్లూ మాత్ర‌మే కాక‌ కొద్దిపాళ్లలో కొవ్వులూ చిరుధాన్యాల్లో ఉంటాయి. అందుకే ఇవి సమతులాహారంగా ఉపయోగపడతాయి. 

చిరుధాన్యాలన్నింటిలోనూ బి-విటమిన్‌ శాతం ఎక్కువ. ఐరన్‌, కాల్షియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌… ఖనిజాలన్నీ సమృద్ధిగా ఉంటాయి.

100 గ్రా. రాగుల నుంచి 344 మి.గ్రా. కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటంవల్ల దంతాలూ ఎముకల పరిపుష్టికి రాగులు దోహదపడతాయి. 

చిరుధాన్యాల్లో అధికంగా ఉండే మెగ్నీషియం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం తక్కువ. ముఖ్యంగా కొర్రలవల్ల మధుమేహం తగ్గుతుంది.

పీచు ఎక్కువగా ఉండటంవల్ల చిరుధాన్యాల్లోని పిండిపదార్థాలు మెల్లగా జీర్ణమవుతాయి. గ్లూకోజ్‌ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంటుంది. అందుకే మధుమేహరోగులకి ఇవి ఎంతో మంచివి. 
పీచు ఎక్కువ‌గా ఉండ‌డం వల్ల గాల్‌బ్లాడ‌ర్‌లో రాళ్లు ఏర్పడవు.

మిల్లెట్స్‌లో ఫైటేట్స్‌, టానిన్స్‌ అనే యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌నీ మధుమేహాన్నీ తగ్గిస్తాయి.

చిరుధాన్యాల‌లోని ఫైటేట్స్‌ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ క్యాన్సర్లూ, గుండెవ్యాధులు రాకుండానూ కూడా కాపాడతాయి.

అలర్జీ కలిగించే గుణం ఉండదు. అందుకే చిరుధాన్యాల మొలకల్ని పిండి పట్టించి, వండిన ముద్దను పిల్లలకీ, పాలిచ్చే తల్లులకీ, ముసలివాళ్లకీ కూడా పెడుతుంటారు. ----- (From Google )



Little Millets / సామలు 

సామల పులిహోర / Little Millet pulihora  

కావలసినవి 

 Little Millets /సామలు - 2 కప్పులు 
నీళ్ళు - 3 కప్పులు 
ఉప్పు - రుచికి సరిపడా 
నూనె - 1 tsp 

తాలింపుకోసం 

నూనె - 1 tbsp 
ఎండుమిర్చి - 3
పల్లీలు/వేరుశనగ గుండ్లు - కొద్దిగా 
పచ్చి శనగపప్పు - కొద్దిగా 
ఆవాలు,జీలకర్ర - కొద్దిగా 
కరివేపాకు - 1 రెమ్మ. 
నిమ్మరసం - 1 నిమ్మకాయ 


తయారుచేసే విధానం 

Little Millets /సామలు శుభ్రంగా కడగాలి. 


కడిగిన సామలని నీళ్లు వంపేసి కుక్కర్ గిన్నెలో వేయాలి. 


ఒక కప్పు సామలకి 1 1/2కప్పు చొప్పున 
3 కప్పుల నీళ్లు పోయాలి. 


కొద్దిగా ఉప్పు,నూనె వేసి ,కుక్కర్ మూతపెట్టి 
2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి 


ఉడికిన సామల అన్నాన్ని కుక్కర్లో నుండి తీసి 
ఒక ప్లేట్ లో పెట్టి ఆరనివ్వాలి. 


బాండీలో నూనె వేసి కాగాక,ఆవాలు,జీలకర్ర వేయించి,
ఎండుమిర్చి,పచ్చిశనపప్పు ,పల్లీలు,కరివేపాకు 
అన్నీ వరసగా వేస్తూ తాలింపు తయారుచేయాలి. 


తాలింపు బాగా వేగాక,పసుపు,ఉప్పు వేసి కలపాలి. 


స్టవ్ ఆఫ్ చేసి,తాలింపులో నిమ్మరసం పిండాలి. 


ముందుగానే ఉడికించి పెట్టిన సామల అన్నాన్ని 
తాలింపులో వేసి బాగా కలపాలి. 


సామల పులిహోర / Little Millet pulihora  రెడీ 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు