.

.

nani

26, ఏప్రిల్ 2017, బుధవారం

మార్బుల్ కేక్ / Marble Cake



Basic Vanilla Cake Batter తో చేసే స్పాంజ్ కేక్ లాగే ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు,అదే కేక్ మిక్స్ లో సగం కేక్ మిశ్రమంలో కోకోవా పౌడర్ కలిపి చేసే ఈ మార్బుల్ కేక్ మంచి రుచితో బాగుంటుంది. 

మార్బుల్ కేక్ / Marble Cake

కావలసినవి 

మైదాపిండి  -1 కప్పు 
పంచదార - 1 కప్పు 
కొకోవా పౌడర్/Cocoa Powder  - 1 tbsp 
కోడిగుడ్లు - 2
బేకింగ్ పౌడర్ - 1 tsp 
బేకింగ్ సోడా - 1/4 tsp 
వెనిల్లా ఎసెన్స్ / Vanilla Essence - 1 tsp 
పాలు - 1 /2 కప్పు 
నూనె - 1/2 కప్పు 


తయారుచేసే విధానం 

కోడిగుడ్లు పంచదార బౌల్ లో వేయాలి. 


బీటర్ తో కోడిగుడ్డు,పంచదార బాగా కలిసి 
నురగ వచ్చేదాకా బీట్ చేయాలి. 


బీట్ చేసిన కోడిగుడ్డు మిశ్రమాన్ని 
మిక్సింగ్ బౌల్ లో వేసి, వెనిల్లా ఎసెన్స్,నూనె,
పాలు వేసి బాగా కలపాలి. 



 మైదా,ఉప్పు,బేకింగ్ సోడా,బేకింగ్ పౌడర్ 
జల్లెడలో వేసి జల్లించి,కోడిగుడ్డు మిశ్రమంలో కలపాలి. 


కేక్ మిశ్రమం /Basic Vanilla Cake Batter 
రెడీ అయ్యింది. 


తయారయిన కేక్ మిశ్రమాన్నిరెండు భాగాలు చేసి 
ఒక దానిలో కోకోవా పౌడర్  కలపాలి. 


చాకోలెట్ ఫ్లేవర్ కేక్ మిశ్రమం తయారయింది. 



వెనిల్లా, చాకోలెట్ ఫ్లేవర్ కేక్ మిశ్రమం ఇలా 
 తయారుచేసి పెట్టాలి. 


కేక్ పాన్ (Pan) లో వెన్న రాయాలి.


వెనిల్లా కేక్ మిశ్రమం,చాకోలెట్ కేక్ మిశ్రమం 
ఒకదానిమీద మరొక లేయర్ గా పోయాలి. 



కేక్ మిశ్రమం అంతా అలాగే పోయాలి. 


Preheat oven to F (180 degrees C)

180 degree Celsius లో ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో
35 - 40 నిమిషాలు  బేక్ చేయాలి. 


టేస్టీ ,స్పాంజీ మార్బుల్ కేక్ / Marble Cake రెడీ 
చల్లారాక ముక్కలు కట్ చేయాలి. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు