.

.

nani

20, ఏప్రిల్ 2017, గురువారం

పాస్తా పాయసం / Pasta Payasam



పాస్తాతో ఎప్పుడూ నూడుల్స్ లా స్పైసీగానే కాకుండా,ఈ పాయసం కూడా వెరైటీగా చాలా బాగుంది.ఎప్పుడైనా పండగలకి,ఫంక్షన్స్ కి 
ట్రై చేయొచ్చు.

పాస్తా పాయసం / Pasta Payasam

కావలసినవి 

పాస్తా - 1 cup 
పాలు - 2 కప్పులు 
పంచదార - 2-3 tbsp (రుచికి తగినట్లు)
Milk Maid /condensed milk - 1 tbsp 
యాలకుల పొడి - 1/4 tsp 
జీడిపప్పు - 10
బాదం - 10
పిస్తా - 10

తయారుచేసే విధానం 


పాస్తాను 1/2 కప్పు నీళ్లలో వేసి,పూర్తిగా ఉడికించకుండా 
కొంచెం మెత్తబడగానే నీళ్లు వంపేసి,వేరే  ప్లేట్ లో పెట్టాలి. 

*పాస్తా నీళ్ళలో మరీ మెత్తగా ఉడికిస్తే,మళ్ళీ పాలలో ఉడికినప్పుడు పేస్ట్ అవుతుంది. 
అందుకే కొంచెం మెత్తగా అవ్వగానే తీసేయాలి. 

ఒక బాండీలో నెయ్యి వేసి,జీడిపప్పు,బాదం వేయించి 
తీసి పక్కన పెట్టాలి. 

ఒక గిన్నెలో పాలు బాగా మరిగించి,పంచదార,
ముందుగానే ఉడికించిన పాస్తా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. 

ఇందులో condensed milk,యాలకుల పొడి 
వేసి బాగా కలిపి,పాలు కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు 
వేయించిన జీడిపప్పు,బాదం,పిస్తా వేసి కలిపి 
స్టవ్ ఆఫ్ చేయాలి. 

పాస్తా పాయసం / Pasta Payasam రెడీ. 
వేడిగా తినొచ్చు,ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తిన్నా బాగుంటుంది. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు