.

.

nani

18, ఏప్రిల్ 2017, మంగళవారం

పొట్లకాయ ఫ్రై / Snake gourd Fry



పొట్లకాయ పత్యం కూర అంటారు.పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది.ఇది తేలికగా అరిగిపోయే కూరగాయ.పొట్లకాయ వాసన వలన చాలామంది ఇష్టపడరు.ఆ వాసన పోవాలంటే పొట్లకాయ పైన తెల్లటి పొరను చాకుతో శుభ్రంగా గీకి,లోపల గింజలన్నీ తీసేసి,ఉప్పు చల్లి బాగా రుద్ది శుభ్రం చేయాలి.


పొట్లకాయ ఫ్రై / Snake gourd Fry

కావలసినవి 

పొట్లకాయలు - 1/4  kg 
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు 
వెల్లుల్లిపాయ కారం - 2Tsp 
నూనె  - 1 Tbsp 
ఆవాలు,జీలకర్ర,పచ్చిపప్పు - కొద్దిగా 
ఎండు మిర్చి - 1

తయారుచేసే విధానం 

పొట్లకాయ పైన తెల్లటి పొరను చాకుతో శుభ్రంగా గీకి,
లోపల గింజలన్నీ తీసేసి,ఉప్పు చల్లి బాగా రుద్ది శుభ్రం చేసి,
సన్నగా ముక్కలు కోయాలి.  


పొట్లకాయ,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి 
సన్నగా ముక్కలు కోయాలి . 


బాండీలో కాగిన నూనెలో తాలింపు గింజలు వేసి వేగాక,
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. 


వేగిన ఉల్లిపాయల్లో ఉప్పు,పసుపు వేసి 
బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. 


ఉల్లిపాయలు బాగా వేగాక,పొట్లకాయ ముక్కలు వేసి కలపాలి 


కూర మగ్గేదాకా 5 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి 


మగ్గిన కూరలో వెల్లుల్లిపాయ కారం వేసి 
బాగా కలిపి మరో 5 నిమిషాలు 
సన్నని మంట  మీద ఉడికించాలి. 


ముక్క బాగా మెత్తగా అయ్యాక,స్టవ్ ఆఫ్ చేయాలి. 
పొట్లకాయ కూర అన్నంలో చాలా బాగుంటుంది. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు