.

.

nani

20, మే 2017, శనివారం

బంగాళాదుంప పచ్చిశనగపప్పు కూర / Aloo Senagapappu Curry /Potato Chana Dal Curry



బంగాళాదుంప,పచ్చిశనగపప్పు కూర కూడా పండగలప్పుడు స్పెషల్ గా చేసుకునే కూర.ఇందులో బంగాళాదుంపలు కొంచెం పెద్దవిగా కోస్తే గ్రేవీ రుచి బాగుంటుంది.పెరుగురైతా ఈ కూరకి మంచి కాంబినేషన్. 



బంగాళాదుంప పచ్చిశనగపప్పు కూర / Aloo Senagapappu Curry /Potato Chana Dal Curry


కావలసినవి 

బంగాళా దుంపలు  - 1/2 kg 
పచ్చి శనగపప్పు - 1 cup 
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 2 రెమ్మలు 
కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు - రుచికి తగినంత 
కారం - 2 tsp 
గరం మసాలా పౌడర్ - 1 tsp 
అల్లం,వెల్లుల్లి,కొబ్బరి పేస్ట్ - 1 tbsp 
నీళ్లు - 2 cups 
నూనె - 2 tbsp 
ఆవాలు,జీలకర్ర - 1 tsp 

తయారుచేసే విధానం 

బంగాళాదుంప పై చెక్కు తీసి,మీడియం సైజ్ 
ముక్కలు కట్ చేయాలి. 
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి  ముక్కలు తరగాలి.  



పచ్చిశనగపప్పులో  1 1/2 కప్పు నీళ్లు పోసి 
కుక్కర్లో ఒక విజిల్ మాత్రమే వచ్చేదాకా 
మరీ  మెత్తగా కాకుండా ఉడికించాలి. 

ఉడికిన పచ్చిపప్పు లో నీళ్ళు వంపేసి ఒక గిన్నెలో తీసి పెట్టాలి. 


అల్లం,వెల్లుల్లి,ఎండుకొబ్బరి మిక్సీలో వేసి 
మసాలా పేస్ట్ తయారుచేసి పెట్టాలి. 


బాండీలో నూనె వేసి కాగాక,ఆవాలు జీలకర్ర వేయించి, ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి చీలికలు,
కరివేపాకు వేసి వేయించాలి. 

ఉల్లిపాయలు వేగాక 
బంగాళాదుంప ముక్కలు కూడా వేయాలి. 


ఉప్పు,పసుపు వేసి కలపాలి. 


బంగాళాదుంప ముక్కల్లో ఉప్పు,పసుపు వేసి కలిపి,
2 నిమిషాలు ముక్కలు వేగిన  తర్వాత, 

తయారుచేసి పెట్టిన 
అల్లం,వెల్లుల్లి,కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపాలి. 


మసాలా బాగా వేగి పచ్చివాసన పోయేదాకా 
మూతపెట్టి ఉడికించాలి. 



ఉడుకుతున్న బంగాళాదుంపల్లో 
ఉడికించిపెట్టిన పచ్చిశనగపప్పు వేసి కలపాలి. 


పచ్చిపప్పుతో పాటు కారం కూడా వేసి కలపాలి. 


కారం కలిపిన తర్వాత 2 కప్పుల నీళ్ళు పోసి 
బంగాళాదుంపముక్కలు,పచ్చిపప్పు మెత్తగా ఉడికేదాకా 
10 నిమిషాలు మీడియం మంటమీద ఉడికించాలి. 


కూర బాగా ఉడికి, చిక్కబడిన తర్వాత 
గరం మసాలా పౌడర్ వేసి కలిపి 
low flame లో మరో 5 నిమిషాలు ఉడికించాలి. 


కూర పూర్తిగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన 
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. 


బంగాళాదుంప పచ్చిశనగపప్పు కూర / Aloo Senagapappu Curry
అన్నంలో, రోటీ,చపాతీల్లో,దోశల్లో కూడా చాలా బాగుంటుంది. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు