.

.

nani

22, మే 2017, సోమవారం

దొండకాయ వేపుడు / Dondakaya Fry


సింపుల్ గా చేసుకునే దొండకాయ వేపుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి వేయకపోతే కూర రుచిగా ఉంటుంది. సాంబార్,రసంలో side dish గా తిన్నప్పుడు కారం లేకుండా ఉంటుంది.కావాలనుకుంటే  పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 


దొండకాయ వేపుడు / Dondakaya Fry


కావలసినవి 

దొండకాయలు - 1/4 kg 
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 2 రెమ్మలు 
వెల్లుల్లి - 2 రెబ్బలు 
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి తగినంత 
కారం - 1 tsp 
నూనె - 1 /2 tbsp 
ఆవాలు,జీలకర్ర - కొద్దిగా 

తయారుచేసే విధానం 

దొండకాయలు పల్చగా చక్రాల్లాగా తరగాలి. 


బాండీలో నూనె వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేయించి,
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేయించాలి. 

దొండకాయ ముక్కలు  కూడా వేయాలి. 


వేగుతున్న దొండకాయ ముక్కల్లో 
ఉప్పు,పసుపు వేయాలి. 


ఉప్పు,పసుపు కలిపి,మీడియం మంటమీద 
5 నిమిషాలు ముక్క మెత్తబడేదాకా వేయించాలి. 


కారం వేసి కలపాలి. 


2 నిమిషాలు కలుపుతూ వేయించి,స్టవ్ ఆఫ్ చేయాలి. 
దొండకాయ వేపుడు / Dondakaya Fry
అన్నంలో సాంబార్,రసంతో తింటే రుచిగా ఉంటుంది.  


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు