.

.

nani

24, మే 2017, బుధవారం

దోసకాయ, టమాటా పచ్చడి / Dosakaya Tomato Pachadi


స్పైసీ గా ఉండే  దోసకాయ,టమాటా పచ్చడి ఇడ్లీ,దోశల్లోకి మంచి కాంబినేషన్. అన్నంలో నెయ్యి కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది.ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మిరపకాయలు కొద్దిగా ఎక్కువే వేయాలి.మిరపకాయలు తక్కువేస్తే పచ్చడి పుల్లగా అవుతుంది.


దోసకాయ,టమాటా పచ్చడి / Dosakaya Tomato Pachadi


కావలసినవి 

దోసకాయ - 1/4 kg 
టమాటాలు - 1/4 kg 
పచ్చిమిర్చి - 10-15
కొత్తిమీర - 1/2 కట్ట 
జీలకర్ర - 1 tsp 
వెల్లుల్లి రెబ్బలు - 6
నూనె - 2 tbsp 
ఉప్పు - రుచికి సరిపడా 


దోసకాయ,టమాటా,పచ్చిమిర్చిలను 
కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చెయ్యాలి

బాండీలో లో నూనె వేసి,కాగాక  
దోసకాయ,టమాటా,పచ్చిమిర్చి
ముక్కలు వేయాలి. 


మూతపెట్టి ముక్కలు మెత్తగా మగ్గేదాకా 
మీడియం మంట  మీద ఉడికించాలి. 


కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత  స్టవ్ ఆఫ్ చేయాలి. 


మిక్సీ జార్లో ఉడికించిన టమాటా,దోసకాయ,పచ్చిమిర్చి ముక్కలు,
సన్నగా తరిగిన కొత్తిమీర,జీలకర్ర,
వెల్లుల్లి రెబ్బలు,తగినంత ఉప్పు వేయాలి. 


అన్నీ మెత్తగా గ్రైండ్ చేస్తే 
దోసకాయ, టమాటా పచ్చడి / Dosakaya Tomato Pachadi
తయారయినట్లే .. దీన్ని రోట్లో కూడా నూరుకోవచ్చు. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు