.

.

nani

8, మే 2017, సోమవారం

మసాలా కార్న్ పఫ్స్ / Masala Corn Puffs




ఒకప్పుడు మొక్కజొన్న కండెలు మాత్రమే తినేవాళ్లు,కానీ ఈరోజుల్లో స్వీట్ కార్న్,బేబీ కార్న్, మొక్కజొన్న పిండితో రోటీలు, కార్న్‌ప్లేక్స్‌ ,పాప్ కార్న్ ఇలా మొక్కజొన్న చాలా రకాలుగా తింటున్నాము.వాటిల్లో ఒకరకం ఈ కార్న్‌ పఫ్స్‌.కార్న్ పఫ్స్ తో స్వీట్  Caramel Puff Corn చేయొచ్చు.బొరుగుల మసాలా లాగా చేసిన మసాలా కార్న్ పఫ్స్ కూడా బాగున్నాయి.


మసాలా కార్న్ పఫ్స్  / Masala Corn Puffs 

కావలసినవి 

కార్న్ పఫ్స్ / Corn Puffs - 2 కప్పులు 
పల్లీలు/వేరుశనపప్పు - 1/4 Cup 
పుట్నాల పప్పు/శనగపప్పు - 1/4 Cup 
కరివేపాకు - 2 రెమ్మలు 
ఎండుమిర్చి - 2
ఆవాలు,జీలకర్ర - 1 tsp 
కారం - 1 tsp 
ఉప్పు - 1 tsp 
నూనె - 2 tsp 



తయారుచేసే విధానం 

బాండీలో నూనె లేకుండా కార్న్ పఫ్స్  కొద్దిగా వేయించాలి 



అదే బాండీలో పల్లీలు,శనగపప్పు వేయించాలి. 


వేయించిన కార్న్ పఫ్స్,పల్లీలు,శనగపప్పు 
ఒక మిక్సింగ్ బౌల్ లో వేయాలి.


బాండీలో నూనె వేసి, కాగాక 
తాలింపు గింజలు,కరివేపాకు,ఎండుమిర్చి,
ఉప్పు,కారం వేసి వేయించాలి. 


తయారయిన తాలింపుని వేయించి పెట్టిన 
కార్న్ పఫ్స్,పల్లీలు,శనగపప్పులో కలపాలి. 


చివరిగా పంచదార పొడి కలపాలి. 


అన్నీ బాగా కలిసేలా కలిపితే 
మసాలా కార్న్ పఫ్స్  తయారయినట్లే. 


స్పైసీ,క్రిస్పీ స్నాక్
మసాలా కార్న్ పఫ్స్  / Masala Corn Puffs 
పాప్ కార్న్ లాగా ఎప్పుడైనా తినొచ్చు. 

*పల్లీలు,శనగపప్పు లేకుండా కేవలం కార్న్ పఫ్స్ తో కూడా ఇలా చేసుకోవచ్చు 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు