.

.

nani

26, మే 2017, శుక్రవారం

మేతీ పూరి / Methi (Fenugreek) Puri


మెంతి ఆకుతో చేసే  ఈ మేతీ చపాతీ, పూరీ కొంచెం చేదుగా అనిపిస్తాయి అంటుంటారు.మెంతి ఆకుని ఉడికించకుండా,పచ్చిదే బాగా సన్నగాతరిగి వేస్తే చేదు రాదు.మెంతి పూరీ ఆరోగ్యానికి కూడామంచిది . 


మేతీ పూరి / Methi (Fenugreek) Puri 

కావలసినవి 

 గోధుమపిండి - 2 కప్పులు 
మెంతి కూర - 1 కప్పు 
అల్లం పేస్ట్ - 1 tsp 
వెల్లుల్లి పేస్ట్ - 1 tsp 
కారం - 1 tsp 
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి తగినంత 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా 

తయారుచేసే విధానం 

గోధుమపిండిలో శుభ్రంగా కడిగి,సన్నగా తరిగిన 
మెంతికూర,ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ 
కొద్దిగా నూనె వేయాలి. 


తగినంత నీళ్లు కలిపి పూరీపిండి కలిపి పెట్టాలి. 


పూరీ పిండిని ఇలా చిన్న ఉండలు చేయాలి. 


కొంచెం మందంగా పూరీలు  వత్తాలి 


డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగగానే 
మీడియం మంటలో పూరీలు వేయించాలి. 


మేతీ పూరి / Methi (Fenugreek) Puri 
పెరుగు రైతాతో తింటే చాలా బాగుంటుంది. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు