.

.

nani

18, మే 2017, గురువారం

వంకాయ పచ్చిశనగపప్పు కూర / Vankaya senagapappu Curry /Brinjal Chana dal curry



వంకాయ పచ్చిశనగపప్పు కూర పండగలప్పుడు,పెళ్ళి భోజనాల్లో ఎక్కువ చేసుకునే వాళ్ళు.పండగ రోజు చేసుకునే పులిహోరలో ఈ కూర చాలా మంచి కాంబినేషన్.ఫ్లేవర్డ్ రైస్ తో,మామూలు అన్నంతో చాలా బాగుంటుంది.


వంకాయ పచ్చిశనగపప్పు కూర / Vankaya Pacchi senagapappu Curry / Brinjal Chana dal curry


కావలసినవి 

వంకాయలు - 1/2 kg 
పచ్చి శనగపప్పు - 1 cup 
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 2 రెమ్మలు 
కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు - రుచికి తగినంత 
కారం - 2 tsp 
గరం మసాలా పౌడర్ - 1 tsp 
అల్లం,వెల్లుల్లి,కొబ్బరి పేస్ట్ - 1 tbsp 
నీళ్లు - 2 cups 
నూనె - 2 tbsp 
ఆవాలు,జీలకర్ర - 1 tsp 

తయారుచేసే విధానం 

పచ్చిశనగపప్పులో  1 1/2 కప్పు నీళ్లు పోసి 
కుక్కర్లో ఒక విజిల్ మాత్రమే వచ్చేదాకా 
మరీ  మెత్తగా కాకుండా ఉడికించాలి. 

ఉడికిన పచ్చిపప్పు లో నీళ్ళు వంపేసి ఒక గిన్నెలో తీసి పెట్టాలి. 


వంకాయ సన్నగా ముక్కలు తరిగి,ఉప్పువేసిన  నీళ్ళలో ఉంచాలి. 
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ముక్కలు తరగాలి. 


అల్లం,వెల్లుల్లి,ఎండుకొబ్బరి మిక్సీలో వేసి 
మసాలా పేస్ట్ తయారుచేసి పెట్టాలి. 



బాండీలో నూనె వేసి కాగాక,ఆవాలు జీలకర్ర వేయించి, ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి చీలికలు,
కరివేపాకు వేసి వేయించాలి. 

ఉప్పు,పసుపు కూడా వేసి కలపాలి


వేగుతున్న ఉల్లిపాయల్లో తయారుచేసి పెట్టిన 
అల్లం,వెల్లుల్లి,కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపాలి. 

మసాలా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. 



వేగిన ఉల్లిపాయలు,మసాలాలో 
తరిగి ఉంచిన వంకాయ ముక్కలు వేసి కలపాలి. 


వంకాయ ముక్కలు మగ్గేదాకా 10 నిమిషాలు మూతపెట్టి ఉడికించి,
ఉడికించి పెట్టిన పచ్చిపప్పు వేసి కలపాలి. 



పచ్చిపప్పుతో పాటు కారం కూడా వేసి కలపాలి. 


కూరలో 2 కప్పుల నీళ్లు పోసి కలిపి,
 వంకాయముక్కలు ఉడికి,కూర చిక్కబడేదాకా  ఉడికించాలి. 


ఉడికిన కూరలో గరం మసాలా పౌడర్ వేసి కలపాలి. 


వంకాయముక్కలు, పచ్చిపప్పు బాగా మెత్తగా ఉడికేవరకు  
low flame లో ఉంచి, 
సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, స్టవ్  ఆఫ్ చేయాలి.


వంకాయ పచ్చిశనగపప్పు కూర / Vankaya senagapappu Curry
వేడి అన్నంలో,రోటీ,చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు