.

.

nani

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

బీట్ రూట్ పూరీ / Beetroot Poori


బీట్ రూట్ పూరీ ఎర్రటి అందమైన రంగుతో,రుచిగా కూడా ఉంటాయి.స్వీట్ ఫ్లేవర్ తో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.చేయటం కూడా ఈజీగా అయిపోతుంది.

బీట్ రూట్ పూరీ / Beetroot Poori


కావలసినవి 

బీట్ రూట్ (Beetroot) - 2
గోధుమపిండి - 2 కప్పులు 
వాము - 1/4 Tsp 
ఉప్పు  - రుచికి సరిపడా 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

తయారుచేసే విధానం 

బీట్ రూట్ శుభ్రంగా కడిగి చెక్కు తీసి,
చిన్నముక్కలుగా చేసి మిక్సీ  జార్లో పేస్ట్  తయారుచేయాలి.


గోధుమపిండిలో కొద్దిగా వాము,నూనె,ఉప్పు,
బీట్ రూట్ పేస్ట్ వేసి బాగా కలపాలి.


పిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి 
ఇలా ముద్ద చేయాలి


పిండిముద్దని చిన్న ఉండలుగా చేసి,
కొంచెం మందంగా పూరీలు వత్తాలి. 


బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి,కాగాక 
పూరీలు రెండు వైపులా వేయించాలి.


బీట్ రూట్ పూరీ / Beetroot Poori 
పూరీ కూరతో తింటే చాలా బాగుంటుంది.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు