.

.

nani

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

టమాటా ఎండుచేపల కూర / Dry Fish Curry With Tomato


ఎండుచేపలు చిన్నప్పటినుండి నాకు చాలా ఇష్టమైన వాటిలో ఒకటి.కానీ ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి తినటం మంచిది కాదని చెప్తున్నారు. అయినా అప్పుడప్పుడు ఆ కూర చేసుకుని తింటుంటాము. వండటం బాగా కుదిరితే చాలా రుచిగా ఉంటుంది.గట్టిగా బారుగా ఉండే ఈ చేపలను కడ్డీచేపలు అంటుంటారు.కాబట్టి ఇది కడ్డీ చేపల కూర. 

 టమాటా ఎండుచేపల కూర / Dry Fish Curry With Tomato


కావలసినవి 

ఎండుచేపలు - 5
టమాటాలు - 1/2 K.g
ఉల్లిపాయలు - 1
పచ్చిమిర్చి - 3
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 Tbsp 
ఎండుకొబ్బరి పొడి - 1 Tbsp
గరంమసాలా పౌడర్ - 1 Tbsp 
కారం - 1 Tbsp 
ఉప్పు - రుచికి సరిపడా 
పసుపు - 1/2 Tsp
కొత్తిమీర - 1 కట్ట 
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 3 Tbsp 
తయారుచేసే విధానం

ఎండుచేపల్లో  అనవసరమైనవన్నీ తీసేసి 
ముక్కలు కట్ చేయాలి.


చేపముక్కల్ని 10 నిమిషాలు వేడినీళ్లలో వేసి ఉంచాలి.
(*ఇలా వేడినీళ్లలో వేయటం వలన చేపముక్కలు బాగా శుభ్రపడతాయి.)


ఎండుచేపముక్కల్ని నీళ్లలోనుండి బయటికి తీసి 
పసుపు వేసిన నూనెలో డీప్ ఫ్రై చేయాలి.


టమాటాలు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా తరగాలి. 
అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పౌడర్,కొబ్బరిపొడి తయారుచేసి ఉంచాలి.


బాండీలో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
కరివేపాకు వేసి వేగాక,అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 
పచ్చివాసన పోయేదాకా వేయించి,
ఉప్పు,పసుపు వేసి కలపాలి.


వేగిన ఉల్లిపాయల్లో  టమాటాముక్కలు వేసి,బాగా కలిపి 
మూతపెట్టి టమాటాలు బాగా మగ్గేదాకా ఉడికించాలి.


టమాటాల్లో నీరంతా బయటికి వచ్చేదాకా ఉడికిన తర్వాత 
కారం,గరంమసాలా వేసి,కూర చిక్కబడేదాకా కలుపుతూ ఉడికించాలి. 
 ఎండుకొబ్బరి పొడి కూడా వేసి కలపాలి. 


కూరంతా బాగా ఉడికిన తర్వాత 1కప్పు నీళ్లు పోసి 
2 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. 


శుభ్రంచేసి,డీప్ ఫ్రై చేసి పెట్టిన ఎండుచేప ముక్కలు వేసి 
బాగా కలిపి సన్నని మంటమీద 5 నిమిషాలు ఉడికించాలి.


చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. 
టమాటా ఎండుచేపల కూర / Dry Fish Curry With Tomato
రెడీ అయినట్లే..ఈకూర అన్నంలో తింటే చాలా బాగుంటుంది.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు