.

.

nani

14, ఫిబ్రవరి 2018, బుధవారం

మామిడికాయ పులిహోర / Mango Pulihora



మామిడికాయ పులిహోర / Mango Pulihora


కావలసినవి 
అన్నం - 2/3 కప్పులు
పచ్చిమామిడికాయ - 1
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 1 రెమ్మ 
 ఉప్పు - రుచికి సరిపడా 

తాలింపుకోసం 
జీడిపప్పు - 10
 వేరుశనగగుండ్లు /పల్లీలు -1 Tbsp 
ఆవాలు,జీలకర్ర - 1 Tsp
పచ్చిపప్పు,మినప్పప్పు - 1 Tsp 
ఎండుమిర్చి - 2
పసుపు - 1/4  Tsp
ఇంగువ - చిటికెడు
నూనె - 1 1 Tbsp 

 

తయారుచేసే విధానం

 మామిడికాయ చెక్కు తీసి సన్నటి గ్రేటర్ తో తురమాలి. 


మామిడికాయ తురుము,పచ్చిమిర్చి చీలికలు 
చేసి ఉంచుకోవాలి.


బాండీలో నూనె వేసి కాగాక ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు,
పచ్చిశనగపప్పు  వేసి,అన్నీ బాగా వేగిన తర్వాత
పల్లీలు,ఎండుమిర్చి,జీడిపప్పు కూడా
వరసగా వేసి తాలింపు బాగా వేయించాలి.

పచ్చిమిర్చి చీలికలు కూడా తాలింపులో వేయించాలి


వేగిన తాలింపులో ఉప్పు,పసుపు,ఇంగువ
వేసి అంతా బాగా కలపాలి.


తాలింపులో మామిడితురుము వేసి కలిపి,
బాగా మగ్గేవరకు వేయించాలి.


మామిడితురుము మగ్గిన తర్వాత
సరిపడినంత అన్నం వేసి బాగా కలపాలి


పుల్లటి మామిడికాయ పులిహోర / Mango Pulihora రెడీ


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు